శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు లేకపోవడంపై అక్కడి మందుబాబులు బెంగ పెట్టుకున్నట్టున్నారు. ఆదివారం రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల ముందు.. ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. మద్యం కోసం పలువురు వాగ్వాదాలు, కొట్లాటలు చేశారు. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది బెల్ట్ వ్యాపారులు ఇష్టానుసారంగా.. నచ్చిన ధరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని పలువురు మందుబాబులు వాపోయారు.
ఇంతగా బారులు తీరిన జనం.. ఎందుకో తెలుసా? - శ్రీకాకుళంలో మందు కోసం బారులు తీరిన ప్రజలు
ఇదేదో సినిమా టికెట్స్ కోసమో.. లేక రైతులు విత్తనాలు, ఎరువుల కోసమో బారులు తీరారనుకుంటే పొరపాటే. ఎందుకంటే గడచిన వారం రోజులుగా మద్యం దుకాణాల్లో నిల్వలు సక్రమంగా లేని కారణంగా ఇలా జనాలు మందు కోసం క్యూ కట్టారు.

దుకాణాల ముందు బారులు.. మద్యం కోసమే