మత్స్యకారుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి సభాపతి సీతారాంతో కలిసి ధర్మాన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లాలో మంచినీళ్లపేట వద్ద రూ.16 కోట్లతో జెట్టీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేశారని... తద్వారా మత్స్యకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మత్స్యకారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషి: డిప్యూటీ సీఎం
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్‌తో మత్య్సకారులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
new fishing harbours