పొందూరు మండలంలోని నారాయణపురం కాలువ నిర్మాణ పనులను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. యాభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో.. 39 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్మాణం పూర్తయితే పొందూరు, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లోని.. కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల శ్రేయస్సు కోరి.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం పెనుబర్తి గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నారాయణపురం కాలువ నిర్మాణాన్ని పరిశీలించిన స్పీకర్ తమ్మినేని - శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజా సమాచారం
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నారాయణపురం కాలువ పనులను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. ఈ నిర్శాణం పూర్తి అయితే.. వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన అన్నారు.
నారాయణపురం కాలువ నిర్మాణాన్ని పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారాం