పకడ్బందీగా వాహన తనిఖీలు.. 4లక్షలు స్వాధీనం - ఎచ్చెర్ల
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడం మండలం సంత ఉరిటి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో 4 లక్షలు స్వాధీనం
By
Published : Apr 3, 2019, 9:54 PM IST
తనిఖీల్లో 4 లక్షలు స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడం మండలం సంత ఉరిటి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ కారులో వెళ్తున్న వ్యక్తుల నుంచి పోలీసులురూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారును తనిఖీ చేయగా ఈ నగదు పట్టుబడింది. ఎన్నికల అధికారులు, పోలీసులు, నోడల్ అధికారి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వాహనం విశాఖ పట్నానికి చెందినదిగా గుర్తించారు.