Karthika Masam Celebbrations: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు జరిగాయి. మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్జీ మహరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీతో మఠం కిటకిటలాడింది.
ఘనంగా కార్తిక మహోత్సవాలు.. స్వామివారికి 56 రకాల నైవేద్యాలు
Karthika Masam Celebbrations: కార్తీక మాసం సందర్బంగా దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరించారు. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు భక్తులు. దీంతో పాటు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.
కార్తీక మాస వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరించారు. తిరుపతమ్మ, గోపయ్య స్వాముల అంతరాలయం, ఆలయంలో కొలువుదీరిన సహదేవతల ఆలయాలను దీపాలతో అలంకరించి పూజలు చేశారు. ప్రత్యేకమైన దీపాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాల మండపంలో భక్తులు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.
ఇవీ చదవండి: