వరుణుడి కరుణ కోసం శివుడికి జలాభిషేకం - sklm
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వర్షాలు పడాలని కోరుతూ గ్రామస్థులు ఉమా కామేశ్వరస్వామి ఆలయంలో శివుడికి జలాభిషేకం చేశారు.
వరుణుడి రాకకోసం శివుడికి జలాభిషేకం
వరుణుడు కరుణించాలని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో గ్రామస్థులు శివుడికి జలాభిషేకం చేశారు. సమీపంలో ఉన్న వంశధార నది నుంచి నీరు తెచ్చి శివలింగానికి సహస్ర ఘటాభిషేకం చేశారు. పొలాల్లో విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురుచూస్తున్నామని రైతులు తెలిపారు. శివుడికి జలాభిషేకం చేస్తే మంచి వర్షాలు కురుస్తాయనేది తమ నమ్మకమని చెప్పారు.