శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ జైల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ త్రినాథ్ ఈరోజు ఉదయం మృతి చెందారు. రాత్రి విధుల్లో ఉన్న ఆయన వేకువజామున మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పాలకొండ సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ త్రినాథ్ మృతి - Head constable in Palakonda sub jail
శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ జైల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ త్రినాథ్ బుధవారం వేకువజామున మృతి చెందారు.
జైల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: గస్తీ కాస్తాం... గ్రామాన్ని రక్షించుకుంటాం!