శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. గ్రామంలోని ఓ యువకుడు వెంటపడి వేధింపులకు గురి చేయడం వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిక్కోలులో విద్యార్థిని ఆత్మహత్య.. యువకుని వేధింపులే కారణమా..?
శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలోని ఓ యువకుడు వేధింపులకు గురి చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో బాలిక ఆత్మహత్య