మత్స్యకారుల ఆగమనం.... ఆనంద బాష్పాలతో స్వాగతం పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు... స్వగ్రామాలకు చేరుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన 15 మంది, విజయనగరానికి చెందిన ఐదుగురు.. తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. వారిరాకతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆనందంలో మునిగిపోయారు. ఏడాదికిపైగా తమకు దూరంగా ఉన్న వారిని చూసి భావోద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చారు.
మళ్లీ చూస్తామనుకోలేదు
తమ వారిని మళ్లీ చూస్తామని అనుకోలేదని మత్స్యకారుల కుటుంబసభ్యులు చెప్పారు. ఇన్నాళ్లు కన్నీళ్లతో కాలం గడిపామని... ఆ బాధ ఇప్పుడు పోయిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులను విడిపించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
ఇదీ చదవండి:
వలస వెళ్లే పరిస్థితి ఉండకూడదు: సీఎం