శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధిలో జరిగిన అగ్నిప్రమాదంలో.. మూడు రేకుల ఇళ్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. ఓ పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతింది. ఓ ఇంట్లో నుంచి పొగలు రావటం గమనించిన స్థానికులు.. అప్రమత్తమయ్యేలోగానే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, బట్టలు, బియ్యంతో సహా అన్నీ కాలి బూడిదయ్యాయి. బాధితులు అంతా కూలిపనులు చేసుకునేవారే. వారి కష్టమంతా బూడిదయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.
టెక్కలిలో అగ్నిప్రమాదం.. రూ.4 లక్షల ఆస్తి నష్టం - శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితులంతా కూలీలు కావడం విచారకరం.
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇళ్లు