Student suicide: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని బవిరి వశిష్ట రోహిణి (17) మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు నిర్వహించిన పరీక్షలు సక్రమంగా రాయనందున తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరుగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Student Suicide: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..ఎందుకంటే..! - శ్రీకాకుళం జిల్లా నేర వార్తలు
Student suicide: ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..?
విద్యార్థిని ఆత్మహత్య