ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Father Killed His Son: భార్యపై అనుమానంతో కుమారుడి దారుణ హత్య.. అప్పు తీర్చమన్నందుకు తల్లీకుమారులపై దాడి - అన్నమయ్య జిల్లా లేటెస్ట్ క్రైమ్ న్యూస్

Father Killed His Son: భార్యపై ఉన్న అనుమానంతో కుటుంబం మొత్తాన్నీ హతమార్చాలని అనుకున్న ఓ వ్యక్తి.. వారిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి పెద్దకుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు తల్లీకుమారుడిపై కత్తితో దాడి చేశాారు. ఈ దారుణ ఘటనలు ఆంధ్రప్రదేశ్​లో చోటుచేసుకున్నాయి.

murder
హత్య

By

Published : Jun 28, 2023, 11:25 AM IST

Father Killed His Son: శ్రీకాకుళం జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న అనుమానంతో.. కుటుంబం మొత్తాన్నే హతమార్చాలని అనుకున్నాడో వ్యక్తి. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పెద్ద కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా.. రెండో కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందిన వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలికి చెందిన కుప్పయ్య అనే వ్యక్తికి భార్య హరమ్మపై ఉన్న అనుమానంతో.. ఏడాదిగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతోపాటు భార్య తప్పు చేసేందుకు తన కుటుంబ సభ్యులే సహకరిస్తున్నారన్న అనుమానంతో.. కుబుంబ సభ్యులందరినీ హతమార్చాలని పథకం వేశాడు. అతడి ఇద్దరు కుమారుల వేరే జిల్లాలో ఉపాధి పనుల నిమిత్తం వెళ్లి ఇటీవలే గ్రామదేవత పండుగ కోసం కుప్పిలి వచ్చారు. అందరూ ఒకేచోట ఉండటంతో ఇదే అదునుగా భావించిన కుప్పయ్య.. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మొదట తన పెద్ద కుమారుడు కొండ్రు తాతారావు(26)పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తాతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మరో కుమారుడు కామరాజుపై దాడి చేయగా.. తీవ్రగాయాలతో అతడు ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో భార్య హరమ్మ, కుమార్తె లక్ష్మి తప్పించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

Killed with lorry: గుంటూరు జిల్లాలో దారుణం.. చెక్‌పోస్టు ఉద్యోగిని లారీతో ఢీకొట్టి హత్య

అప్పు తీర్చమన్నందుకు.. బంధువులపై కత్తితో దాడి..:మరోవైపు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో అప్పు తీర్చమన్నందుకు బంధువులనే విషయాన్ని కూడా మర్చిపోయి తల్లీకుమారులపై ఇద్దరు వ్యక్తులు కత్తితో.. దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మదనపల్లె పట్టణంలోని వివేకానందనగర్​కు చెందిన నరసింహులు భార్య లక్ష్మీదేవి(49).. కరోనా కాలంలో తన సోదరి మహేశ్వరికి 4లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చింది. అయితే రెండు సంవత్సరాల క్రితం మహేశ్వరి కొవిడ్ మహమ్మారి సోకి మృతి చెందింది. దీంతో ఆమె తీసుకున్న అప్పుపై.. అప్పట్లో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో మహేశ్వరి కుటుంబ సభ్యులు ఆ అప్పును తీర్చేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ నగదును కొంత ఆలస్యంగా చెల్లిస్తామని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది.

Crimes: పుట్టింటికి వెళ్తానన్నందుకు భార్య హత్య.. తాళం వేసుకుని వెళ్తే.. ఇంట్లో సొమ్ము గోవిందా..

కాగా.. మృతురాలి భర్త వెంకట నారాయణాచారి.. ప్రస్తుతం 'మహేశ్వరి గోల్డ్ షాప్' పేరుతో ఓ నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ షాపు వద్దకు బాధితురాలు వెళ్లి.. తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించమని అడిగింది. అయితే వారు ఆ డబ్బును తిరిగి చెల్లించేది లేదని.. చనిపోయిన మహేశ్వరి వద్దకే వెళ్లి తీసుకోమని చెప్పడంతో.. లక్ష్మీదేవి గొడవకు దిగింది. దీంతో నారాయణాచారి, అతడి కుమారుడు హరీష్​ ఇద్దరూ కలిసి ఆమెపై కత్తితో దాడికి దిగారు. ఇది గమనించిన లక్ష్మీదేవి కుమారుడు పవన్ కుమార్(27) తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అతడిపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లీకుమారులు ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వటంతో స్థానికులు.. వారిని ఆటోలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details