శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ అడిటోరియంలో... జిల్లాస్థాయి యువజనోత్సవాలు జరిగాయి. యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. యువతలో సృజనాత్మకత వెలికితీయడానికి యువజనోత్సవాలు దోహదపడతాయని సభాపతి పేర్కొన్నారు. పుస్తకాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. అన్ని విషయాలపై జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
'చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలి' - శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ అడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు
శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన యువజనోత్సవాలకు సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు. యువత చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
!['చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలి' District level youth festivities in the Silver Jubilee Auditorium of Srikakulam Arts College](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5518513-874-5518513-1577518226450.jpg)
యువజనోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సభాపతి తమ్మినేని సీతారం, తదితరులు