ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో.. ఇంటి నిర్మాణం కష్టమే: ధర్మాన కృష్ణదాస్ - ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీలపై సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్‌తో కలిసి ఉపముఖ్యమంత్రి సమీక్షించారు.ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో ఇళ్ల నిర్మాణాల చేపట్టడం కష్టతరమేనన్నారు.

Dharmana Krishnadas
ధర్మాన కృష్ణదాస్

By

Published : Aug 10, 2021, 1:41 PM IST

ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇంటి నిర్మాణం కష్టమే: ధర్మాన కృష్ణదాస్

రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని జగనన్న కాలనీలపై సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్‌తో కలిసి ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ సమీక్షించారు.

జగనన్న కాలనీలు నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి అధికారులను కోరారు. ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో ఇళ్ల నిర్మాణాల చేపట్టడం కష్టతరమేనన్న కృష్ణదాస్.. అధికారులు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details