ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంకు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్​ - కొవిడ్ వ్యాక్సిన్​ తాజా సమాచారం

శ్రీకాకుళం జిల్లాకు కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. శనివారం తొలి విడుతలో ఆరోగ్య సిబ్బందికి వేస్తామని జేసీ శ్రీనివాసులు తెలిపారు. తొలి విడుతలో 26,500 మందికి డోసులు వేసే ఆస్కారం ఉందన్నారు.

covid vaccine arrived to srikakulam district
శ్రీకాకుళంకు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్​

By

Published : Jan 13, 2021, 6:51 PM IST

శ్రీకాకుళం జిల్లాకు కొవిడ్ వ్యాక్సిన్‌ చేరుకుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వీటిని భద్రత పరిచారు. మూడు బాక్సుల్లో 2,650 కొవిడ్ వ్యాక్సిన్‌లు వచ్చాయని జేసీ శ్రీనివాసులు తెలిపారు.

మొదటి విడతకు సంబంధించిన కొవిడ్ వ్యాక్సిన్ 26,500 మందికి డోసులు వేసేందుకు ఆస్కారం ఉంటుందని జేసీ తెలిపారు. ఇప్పటికే 21,980 మంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగంపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం 18 కేంద్రాలలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సిన్ ఆరోగ్య సిబ్బందికి వేస్తామని జేసీ శ్రీనివాసులు చెప్పారు.

ఇదీ చదవండి

కొవిడ్ టీకా నిల్వ చేసే గదిని పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details