శ్రీకాకుళం జిల్లాలో లాక్డౌన్ ప్రక్రియలో కొన్ని సవరణలు చేసినట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూరగాయలు, పండ్ల దుకాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఇతర దుకాణాలు తీసుకోవచ్చని చెప్పారు.
జిల్లాలో బట్టలు, బంగారం, చెప్పుల షాపులకు అనుమతి లేవని స్పష్టం చేశారు. క్రయ, వికర్యాలు చేసేవారంతా.. భౌతిక దూరం పాటించి కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలన్నారు. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల అపరాధ రుసుం వసూలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.