అభ్యర్థుల ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి కళా వెంకట్రావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజు శుక్రవారం జోరుగా ప్రచారం చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి మండలంలో ప్రచారం సాగించారు. నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ పర్యటించారు. అలాగే రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని నాయకులు పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి..