ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు, ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. యువత రక్తదానం - rakthanidhi nindukundhi article

శ్రీకాకుళం జిల్లా గొళ్ల సీతారాంపురం గ్రామంలో యువత రక్తదాన శిబిరం నిర్వహించారు. 'ఈనాడు, ఈటీవీ భారత్​' లో 'రక్తనిధి ఖాళీ' అంటూ ప్రచురితమైన కథనాలకు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈటీవీ భారత్​ 'రక్తనిధి' కథనానికి స్పందన
ఈటీవీ భారత్​ 'రక్తనిధి' కథనానికి స్పందన

By

Published : Apr 6, 2020, 10:46 AM IST

ఈనాడు, ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

కరోనా వైరస్‌ కారణంగా నెల రోజులుగా రక్తదాన శిబిరాలు జరగడం లేదని.. ఈ కారణంగా ‘రక్తనిధి' నిండుకుందని చెబుతూ ఈనాడు, ఈటీవీ భారత్ లో కథనాలు వచ్చాయి. ఆపదలో ఉన్న వారికి, అత్యవసర రోగులకు అవసరమైన రక్తం తక్షణం అందించేందుకు వీలు కాని పరిస్థితి.. ఈ కథనాలతో వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతారాంపురం గ్రామంలోని యువత.. ఈ సమస్యపై వెంటనే స్పందించారు. 'రెడ్​క్రాస్​' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో భాగం పంచుకున్నారు. గ్రామానికి చెందిన 15 మంది యువత రక్తదానం చేశారు. 'రెడ్​క్రాస్​' సంస్థ ప్రతినిధులు యువతకు ప్రశంసాపత్రాన్ని అందించి వారిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details