గిరిజనుల అభివృద్ధి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభించటాన్ని నిరసిస్తూ...భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట సంత నుంచి ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. అక్కడి కార్యలయ ముఖద్వారం వద్ద భాజపా ఎమ్మెల్సీ మాధవతోపాటు పలువురు నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు.
జీవో నెంబర్ 3 పై ఆర్డినెన్స్, 1/70 చట్టం అమలు చేయాలి - tribal development issues latest
గిరిజనుల అభివృద్ధి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి... నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 3 పై ఆర్డినెన్స్ తీసుకురావాలని, 1/70 చట్టం అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు.
గిరిజనుల అభివృద్ధి కొరకు నిరసన
జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ తీసుకురావాలని, 1/70 చట్టం అమలు చేయాలని నినాదాలు చేశారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని కొనసాగించాలని కోరారు. అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో భాజపా నాయకులు జయరాజ్, ఉమామహేశ్వరరావు, పెంట తిరుపతిరావు.....పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...ఎన్టీఆర్ గృహ సముదాయాలను తక్షణమే కేటాయించాలి: అఖిలపక్షం