ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొమ్ము రాదు... సొసైటీల శోకం తీరదు

సిక్కోలు నేతన్నలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆప్కో  చెల్లింపులు నిలిచిపోయి చేనేత సొసైటీలు నష్టాల బాటలో ప్రయాణిస్తున్నాయి. ఏడాదిగా పేరుకుపోయిన బకాయిలతో చేనేత రంగం ప్రమాదంలో పడింది.

By

Published : Apr 29, 2019, 8:03 AM IST

చేనేతకు లేదు చేయూత

చేనేతకు లేదు చేయూత

శ్రీకాకుళం జిల్లా చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిల విడుదల నిలిచిపోయినందున నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సహకార సంఘాలు కుదేలయ్యాయి. వీటిపై ఆధారపడిన కుటుంబాలు పస్తులుంటున్నాయి. వచ్చిన వృత్తి వదులుకోలేక.. వలస వెళ్లలేక మానసిక ఆందోళనలో ఉన్నారు నేతన్నలు. ఆప్కో బకాయిలు సకాలంలో అందక సొసైటీలు తలుపులు మూసే పరిస్థితి నెలకొంది.

కోట్ల రూపాయల బకాయిలు
జిల్లా వ్యాప్తంగా 42 సహకార సంఘాలున్నాయి. చురుగ్గా పని చేస్తున్న 32 సంఘాల పరిధిలో సుమారు 18 వందల మగ్గాలున్నాయి. వీటిలో 24 సంఘాలు ఆప్కోకు వస్త్రాలు విక్రయిస్తుండగా... వీటికి చెల్లింపుల జాప్యంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. లాభాల్లో ఉన్న సొసైటీలకూ సమస్య తప్పడం లేదు. రుణాలు తీసుకొని నూలు కోనుగోలు, కార్మికులకు చెల్లింపులు చేస్తున్నారు. 2018 మార్చి నుంచి ఈ సొసైటీలకు ఆప్కో 2కోట్ల 80లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులు ఆగిపోయి సంఘాల నిర్వహణ అగమ్యగోచరంగా తయారైంది. ఆప్కోనే నమ్ముకున్న సంఘాలు నేడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆర్థిక ఊబిలో కూరుకుపోయి మూతపడే దుస్థితికి వచ్చాయి.

చేనేత వృత్తి వారిని అన్ని విధాలుగా అదుకుంటామని ఆప్కో డీఎంవో చెబుతున్నారు. కేవలం ఆప్కోకు వస్త్రాలు సరఫరా చేయడం వల్లే బకాయిలు పేరుకుపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని నేతన్నలు పోతున్నారు. ఇకనైనా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details