శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసరావు పై గ్రామస్థులు దౌర్జన్యానికి దిగారు. గ్రామంలో 35 రేషన్ కార్డులను అక్రమంగా పొందినట్లు అందిన ఫిర్యాదుపై ఎమ్ఆర్వో ఆరు బృందాలతో విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వర్గం తహసీల్దార్ పై జులుం ప్రదర్శించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇంకా చాలా రేషన్ కార్డుల్లో అక్రమాలున్నాయని, అన్నింటి పైనా విచారణ జరపాలని తహసీల్దార్ వెంటపడ్డారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని చెబుతున్నా గ్రామస్థులు కొందరు తహశీల్దార్ మీదకు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెనుదిరిగారు. విచారణ మాత్రం ఆగదని స్పష్టం చేశారు.
అక్రమ కార్డులపై తహశీల్దారు విచారణ... గ్రామస్తుల దౌర్జన్యం - SKLM
రేషన్ కార్డులను అక్రమంగా పొందినట్లు అందిన ఫిర్యాదుపై తహశీల్దారు టెక్కలి మండలంలో ఆరు బృందాలతో విచారణ చేశారు. ఈ వ్యవహరంపై ఫిర్యాదు చేసిన వారి పేర్లు బయట పెట్టాలని గ్రామంలోని ఓ వర్గం వారు తహశీల్దారుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అక్రమ రేషన్ కార్డులపై తహశీల్దారు విచారణ...దౌర్జన్యం చేసిన గ్రామస్తులు