శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నబగ్గు రమణమూర్తి.. విజయంపై ధీమాగా ఉన్నారు. గతంలో ఎన్నడూ సాధించలేని అభివృద్ధిని ఈ ఐదేళ్లలో చేసి చూపించామని చెప్పారు.బొంతు ఎత్తిపోతల పథకంతోపాటు ఎన్నో సాగు, తాగు నీరందించే కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఆ అభివృద్ధిని చూపించే.. ఓట్లు అడుగుతున్నామని ప్రగతి నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు.
ప్రగతి నివేదిక:
-
రూ.180 కోట్లతో 12 వేల ఎకరాలకు సాగు నీరందించే బొంతు ఎత్తిపోతల పథకం
-
వనిత మండలంలో రూ.72 కోట్లతో బ్రడ్జి నిర్మాణం
-
రూ. 22 కోట్లతో నవతన ఎత్తిపోతల పథకం పూర్తి