ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాకుళంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

By

Published : May 2, 2019, 6:10 AM IST

Updated : May 2, 2019, 8:08 AM IST

ఫొని తుఫాను పునరావాస కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు.ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు ప్రారంభించారు.

శ్రీకాకుళంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

ఫొని తుఫాను ప్రభావంపై శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు. ఫొని తుఫాను పునరావాస కార్యక్రమాలపై రాత్రి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో రెండు వందల మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశముందన్నారు. ముందస్తుగా గ్రామాలకు తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించామన్నారు. అలాగే అగ్నిమాపక శాఖ బృందాలను కూడా పంపించామని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల మండలాల్లో ఐదు జేసీబీలు సిద్ధంగా ఉంచాలని అధికారులను అదేశించారు. బృందాలను సరైన ప్రదేశాల్లో ఉంచాలన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు వెళ్లగలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి పథకాలకు జనరేటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అలాగే మండలానికి 800 సోలార్ దీపాలు ఇస్తామన్న కలెక్టర్‌... మొబైల్ ఛార్జర్స్‌ను కూడా పంపిస్తున్నామన్నారు. వంశధార, నాగావళి నదీతీరంలో ముంపునకు గురి అయ్యే గ్రామాలను తక్షణం ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్న కలెక్టర్‌... ఇప్పటికే ఒడిశాలోని జలాశాయాల నుండి నీటి విడుదల ప్రారంభం అయ్యిందన్నారు. పసి పిల్లలు ఉన్న చోట్ల పాలు, అంగన్వాడీ కేంద్రాల్లో గల టెట్రా ప్యాక్‌లను ఉపయోగించవచ్చని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.

శ్రీకాకుళంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
Last Updated : May 2, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details