ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటి నుంచి తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.వెయ్యి సహాయం - తెల్ల రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయలు పంపిణీ

పేద కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున కరోనా సాయం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి అమలు కానుంది. నేరుగా ఇళ్లకు వెళ్లి నగదు సాయం అందించేందుకు వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం బ్యాంకుల నుంచి నగదు తీసుకొని కార్యదర్శులకు అధికారులు అందజేస్తారు.

andhra pradesh governmen gives tone thousand rupees to white ration card holders
రేపటినుంచి తెల్ల రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయలు

By

Published : Apr 3, 2020, 2:57 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్‌ కార్డుదారులున్నారు. వీరందరికీ నెలనెలా సరకులు అందజేస్తున్నారు. మార్చి 29 నుంచి రేషన్‌ సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. బియ్యం, కందిపప్పు, పంచదార ఇప్పటికే లక్షల కుటుంబాలకు చేరువ చేశారు. సరుకులు సమకూర్చినా.. ఇతర ఖర్చుల కోసం కొంత నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి పేద కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. తెలుపు రేషన్‌కార్డు ఉన్నవారికే వీటిని అందజేస్తామని ప్రకటించింది.

ఏప్రిల్‌ నాలుగో తేదీన పేదలకు నగదు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు రూ.75.06 కోట్లు కేటాయించారు. నగదు సమకూర్చాలని బ్యాంకులను నిర్దేశించారు. యూనియన్‌ బ్యాంకు అత్యధికంగా రూ.41.70 కోట్లు సమకూర్చాల్సి ఉండగా, ఇతర బ్యాంకులు మిగతా మొత్తాన్ని సమకూర్చుతాయి. 3 న బ్యాంకుల నుంచి నగదు తీసుకుని వార్డు/ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు.

చిత్రం తీసి నగదు చెల్లింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పేదలకు నగదు అందించే సందర్భంలో వేలి ముద్రలు, సంతకాలు తీసుకోవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. నగదు ఇచ్చినట్లు కార్డుదారుని చిత్రం (ఫొటో) మాత్రమే తీయాలి. రేషన్‌ సరకులకు, వైఎస్‌ఆర్‌ పింఛను కానుక నగదు పంపిణీ సమయంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. దీన్ని ఉన్నతాధికారులకు తరువాత నివేదించాల్సి ఉంటుంది. నగదు అందినట్లు సాక్ష్యం కోసమే ఇలా చేస్తున్నట్లు అధికార వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో తొలి కరోనా మరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details