మాజీ విప్, శ్రీకాకుళం తెదేపా నేత కూన రవికుమార్ ఇంట్లో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూన రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూన రవికుమార్ పది మంది అనుచరులు బుధవారం సాయంత్రం ఆముదాలవలస పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. రవికుమార్ జాడ తెలికపోవడం వలన డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో రవికుమార్ ఇంట్లో సోదాలుచేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడంపై రవికుమార్ భార్య ప్రమీల పోలీసులను ప్రశ్నించారు. మహిళలమని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆమె అవేదన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు
తెదేపా నేత కూన రవికుమార్ ఆచూకీ కోసం పోలీసులు బుధవారం రాత్రి...శ్రీకాకుళంలోని ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు అనుగుణంగా ఈ సోదాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి మహిళలు ఉన్నారని చూడకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని రవికుమార్ సతీమణి ఆరోపించారు.
అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు
Last Updated : Aug 29, 2019, 9:33 AM IST