ప్రైవేట్ ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల కొరడా - వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు వార్తలు
నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు సరఫరా చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించిన కారణంగా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళంలో డివిజన్ల వారిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ నిఘా అధికారుల బృందం సోమవారం తనిఖీలు చేసింది. నాణ్యమైన ఎరువులు విత్తనాలు రైతులకు సరఫరా చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో నిఘా అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించి ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వలు, వాటి నాణ్యత రికార్డుల తనిఖీ చేపట్టారు. నరసన్నపేటలో 5 ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. టెక్కలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తిరుమల రావుతో పాటు వ్యవసాయ అధికారి సునీత, దళిత బృందాలు ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇవీ చూడండి...:సీతంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోరీ..ఐదు కంప్యూటర్లు అపహరణ
TAGGED:
PRABHUSARMA