శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఇటీవల జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రశీల అనే బాలిక తీవ్రంగా గాయపడింది. బాలిక తండ్రి శ్రీనివాసరావుది పేద కుటుంబం. తన వద్ద ఉన్న డబ్బుతోపాటు మరో 2 లక్షలు అప్పుచేసి చికిత్స చేయించాడు. తల్లి చర్మం తీసి కుమార్తెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. విశాఖ విమ్స్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ వద్ద డబ్బులు అయిపోయిన కారణంగా.. భార్య, కూతురుకు అదనపు చికిత్స అందించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ఎవరైనా సహాయం అందిస్తే రెండు ప్రాాణాలను కాపాడుకుంటానని విలపిస్తున్నాడు. వైద్యానికి మరో 4 లక్షలు ఖర్చుఅవుతాయని వైద్యులు సూచించినట్లు తెలిపాడు.
- సహాయం చేయాలనుకునే వారు 79958 80331 నంబర్ లో సంప్రదించాలని కోరాడు.