land issue in Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన రామయ్య అనే రైతుకు సంబంధించిన 3.36 ఎకరాల భూమిని గతంలో నాసన్ కంపెనీకి తీసుకున్నారు. కంపెని వారు ఇచ్చే పరిహారం తక్కువగా ఉండటంతో రైతు తన భూమిని ఇవ్వనని హైకోర్టును ఆశ్రయించాడు. అనంతరం ఇటీవల రైతు తన పొలానికి కంచె వేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, నాసన్ కంపెనీ ప్రతినిధులు రైతు రామయ్య, అతని భార్యను నిర్బంధించి కంచె తొలగించారు. రామయ్యకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు సంతానం కాగా.. ఓ కుమార్తె బెంగళూరులో, మరో కుమార్తె, కుమారుడు హైదరాబాదులో ఉంటున్నారు. తల్లిదండ్రులను నిర్బంధించడంపై హైదరాబాదులో ఉన్న కుమార్తె ప్రియాంక అంతర్జాలంలో స్పందించింది. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. మండలంలో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.
రైతును బంధించి పొలానికి వేసిన కంచెను తొలగించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు - రైతును బంధించి న వార్త
land issue in AP: శ్రీసత్యసాయి జిల్లాలో రామయ్య అనే రైతుకు సంబంధించిన 3.36 ఎకరాల భూమిని గతంలో నాసన్ కంపెనీకి తీసుకున్నారు. పరిహారం తక్కువగా ఉండటంతో రైతు తన భూమిని ఇవ్వనని హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల రైతు తన పొలానికి కంచె వేయడంతో.. పోలీసులు, రెవెన్యూ అధికారులు, నాసన్ కంపెనీ ప్రతినిధులు రైతు రామయ్య, అతడి భార్యను నిర్బంధించి కంచె తొలగించారు.
land issue