Floods problems అంత్యక్రియల కోసం అష్టకష్టాలు పడ్డ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కంబాలపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలంటే.. మార్గమధ్యలో పెద్ద వాగును దాటాల్సి ఉంది. వరద ప్రవహిస్తుండటంతో.. అతికష్టం మీద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల వాగును దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధులు, మహిళలు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్మశానానికి రోడ్డు వేయాలని ఏళ్ల తరబడి అధికారులకు విన్నవించినా.. పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంత్యక్రియలు జరపాలంటే వాగులో నడవాల్సిందే - శ్రీసత్యసాయి జిల్లాలో వరద ఉద్ధృతి
Floods problems వర్షాల వల్ల రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రాంతంలో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించాల్సి వస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి విపత్కర స్థితే శ్రీ సత్య సాయి జిల్లాలో ఎదురైంది. అసలేమైందంటే.
అంత్యక్రియలు