చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఓ యువకుడు తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల 26న విజయవాడ దుర్గ గుడి నుంచి యాత్ర ప్రారంభించాడు. ఒంగోలు చేరుకున్న యువకునికి తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంలో రఘుబాబును అభినందిస్తూ.. సన్మానించారు. చంద్రబాబు కోసం 2014లో కూడా పాదయాత్ర చేశానని.. అదే నమ్మకంతో మళ్లీ పాదయాత్ర చేస్తున్నానని రఘుబాబు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన తెదేపా నేతలు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు సీఎం కావాలని తిరుమలకు యువకుడు పాదయాత్ర - tdp
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ యువకుడు తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు.
యువకుని పాదయాత్ర