ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్పీ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. భరత్ అనే యువకుడు తనను ప్రేమించి... పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరకు మోసం చేశాడంటూ యువతి ఆరోపించింది. యువతి, యువకులిద్దరూ ఒకే సచివాలయంలో వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

డీఎస్పీ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం
డీఎస్పీ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 20, 2020, 5:36 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎలుకల మందు తాగి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

భరత్ అనే యువకుడు తనను ప్రేమించి.... పెళ్లి చేసుకుంటానని చివరకు మోసం చేశాడని యువతి ఆరోపించిది. పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా.... తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదంటూ మొహం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసు స్టేషన్​లో మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఎస్​ఐ పట్టించుకోవట్లేదని బాధిత యువతి ఆరోపించింది. యువతి, యువకుడు ఇద్దరూ ఒకే సచివాలయంలో వాలంటీర్లు​గా పని చేస్తున్నారు.

యువకుడి తండ్రి సున్నిపెంట డ్యామ్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడని... ఏం చేసుకుంటావో చేసుకోవాలని తనను బెదిరిస్తున్నాడని యువతి పోలీసులకు తెలిపింది. ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

ఇదీ చూడండి:బాకీ తీర్చలేదని యువకుడు కిడ్నాప్..రూ.5 లక్షలు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details