ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంకల్పయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా ప్రకాశం జిల్లా కంభం మండలంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను... వైకాపా కార్యకర్తలు గజమాలతో ఘనంగా సత్కరించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి జగన్ కృషి చేస్తున్నారన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి: అన్నా రాంబాబు - ముఖ్యమంత్రి జగన్ న్యూస్
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లైన సందర్భంగా కంభంలో కార్యకర్తలతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.
అన్ని వర్గాల అభ్యనున్నతికి సీఎం జగన్ కృషి