ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పుచౌటపాలెంలోని విద్యుత్ లైన్మెన్ నాగార్జునరెడ్డిపై అదే గ్రామానికి చెంది వైకాపా నేత కొందరితో కలిసి దాడి చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పుచౌటపాలెంలోని విద్యుత్ లైన్మెన్ నాగార్జునరెడ్డిపై అదే గ్రామానికి చెంది వైకాపా నేత కొందరితో కలిసి దాడి చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
తూర్పుచౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం సమయంలో వరిగడ్డితో వెళుతున్న ట్రాక్టర్ విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టడంతో విరిగిపోయింది. విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగి, విద్యుత్ లైన్మెన్.. ట్రాక్టర్ని అడ్డుకున్నాడు. తమ పై అధికారి వచ్చేవరకు అక్కడే ఉండాలని వాహన చోదకుడిని అపటంతో.. గ్రామసర్పంచ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురితో మాట్లాడి స్థంభానికి మరమ్మతులు చేయించాలని ట్రాక్టర్ డ్రైవర్‌కు తెలిపారు. ఆ సమయంలో స్థానిక వైకాపా నేత రాచపూడి భాస్కర్ జోక్యం చేసుకొని.. ట్రాక్టర్ చోదకుడిని వెళ్ళిపొమ్మని చెప్పటంతో లైన్ మెన్ నాగార్జునరెడ్డి అడ్డుకున్నాడు. ఆగ్రహించిన భాస్కర్ మరో ఇద్దరితో కలసి లైన్ మెన్ పై దాడి చేశారు.
లైన్ మెన్ గ్రామం నుంచి దర్శి వస్తుండగా మార్గమధ్యలో అడ్డగించి మరోమారు అతనిపై దాడి చేసి ద్విచక్రవాహనాన్ని, చరవాణిని బలవంతంగా లాక్కున్నారు. ఘటన సమాచారాన్ని అందుకున్న విద్యుత్ ఏఈ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సైని వివరణ కోరగా ఘర్షణ విషయం తమ దృష్టికి వచ్చిందని.. కేసు నమోదు కాలేదన్నారు.
ఇదీ చదవండి:ప్రేమించానని దగ్గరయ్యాడు... పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు!