ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం' - ycp farmer section president assured the people of Parchur constituency

ప్రకాశం జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. పర్చూరు, ఇంకొల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ycp farmer section president Nagireddy
ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం

By

Published : Dec 1, 2020, 4:11 PM IST

నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న మిర్చి, పొగాకు పంటల వివరాలు తెలుసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన, పర్చూరు నియోజకవర్గంలో మిరప, పత్తి, పొగకునకు ఎక్కువ నష్టం కలిగిందని వివరించారు. ప్రతి రైతుకు సీఎం జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. రెండో పంట వేసుకోవటానికి విత్తనాలు ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details