ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన అయిమాల శ్యాంసన్ కనిపించడం లేదని... ఆయన భార్య పరమగీతం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. 19న ఓట్ల లెక్కింపు అనంతరం విజేతగా అధికారుల నుంచి ఆయన ధ్రువపత్రం అందుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జీవీ చౌదరి తెలిపారు.
ఎంపీపీ పదవి కోసం వైకాపాలో ఇరువర్గాల మధ్య పోటీ.. ఎంపీటీసీ సభ్యుడు అదృశ్యం - ఏపీ న్యూస్
ప్రకాశం జిల్లాలోని యద్దనపూడిలో ఎంపీపీ పదవి కోసం వైకాపాలో ఇరువర్గాల మధ్య పోటీ నెలకొంది. మండలం యనమదల నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన అయిమాల శ్యాంసన్ కనిపించడం లేదని... ఆయన భార్య పరమగీతం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్యాంసన్ అదృశ్యానికి వైకాపాలోని వర్గపోరే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యద్దనపూడి మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థి మృతి కారణంగా పోలూరులో ఎన్నికలు నిలిచాయి. మిగతా ఏడింటిలో ఒకటి తెదేపా... ఆరు వైకాపా సొంతం చేసుకున్నాయి. ఎంపీపీ పదవికి అధికార పార్టీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆధిక్యం కోసం ఓ వర్గం వారు ఆయనను అపహరించారన్న ప్రచారం సాగుతోంది.
ఇదీ చదవండి: AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు