ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదృష్టం కలిసొచ్చింది..నిన్న వాలంటీర్​..నేడు ఎంపీటీసీ..రేపు

ఆమె మొదట వాలంటీర్..​. అదృష్టం తలుపు తట్టింది... దాంతో పరిషత్​ ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్టు దక్కింది. భారీ మోజార్టీతో ఎంపీటీసీగా గెలుపొందారు. ఇప్పుడు ఎంపీపీ కానున్నారు.

భూక్యా శాంతి భాయి
భూక్యా శాంతి భాయి

By

Published : Sep 21, 2021, 10:12 PM IST

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో.. ఎలా వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు...అందుకు ఉదాహరణ గ్రామ వాలంటీర్​గా ప్రస్థానం ప్రారంభించి ప్రకాశం జిల్లా మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికారపీఠం ఎక్కనున్న భూక్యా శాంతిబాయి.

మార్టూరు మండలంలోని నగరాజుపల్లె తండాకు చెందిన శాంతిబాయి.. బీకాం, బీఈడి పూర్తి చేశారు. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్​ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్​తో వివాహం జరిగింది. మార్టూరులో గ్రామ వాలంటీర్​గా ఆమె పని చేశారు. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావటంతో.. స్థానిక జనార్దన్ కాలనీ నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగారు. తెదేపాకు చెందిన అభ్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజారిటీతో శాంతాబాయి గెలుపొందారు.

మండలంలోని 21మంది ఎంపీటీసీలలో ఎస్టీ మహిళ కేటగిరి కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవటంతో మార్టూరు ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనంగా మారింది.. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఈమె పిన్న వయస్కురాలు కావడం విశేషం.

ఎంపీపీ కానున్న భూక్యా శాంతి భాయి

మా అమ్మానాన్న నన్ను కష్టపడి చదివించారు. బీకాం, బీఈడీ పూర్తి చేశాను. ఎంపీటీసీగా గెలిచాను..ఇప్పుడు ఎంపీపీ కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. పాప పుట్టడం వల్లే నాకు కలిసి వచ్చింది. -భూక్యా శాంతి బాయి, ఎంపీటీసీ

గత ఆగస్టు నెలలో ఆడపిల్లకు జన్మనిచ్చానని.. నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు సంతోషంగా ఉందని శాంతబాయి చెప్పారు. పురుషులతో సమానంగా మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో అవకాశం కల్పించటం నచ్చి రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు. మార్టూరు మండల ప్రజల అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు.


ఇదీ చదవండి:KODALI NANI: కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details