జనావాసానికి దగ్గర్లో మద్యం దుకాణం ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని నిలిపివేయాలని ప్రకాశం జిల్లా చీరాలలోని ఉడ్నగర్ ప్రాంత ప్రజలు కోరారు. సమీపంలోనే నివాస గృహాలు, విద్యార్థుల వసతి గృహాలు, వైద్యశాలలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు మానుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
'నివాస ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణం వద్దు'
నివాస ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణ ఏర్పాట్లను విరమించుకోవాలని చీరాలలోని ఉడ్నగర్ ప్రజలు కోరారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనసంచారం వద్ద మద్యం దుకాణాన్ని మూసేయాలని నిరసన