ప్రకాశం జిల్లా ఒంగోలులో జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలకు ఆటంకం ఎదురైంది. దశాబ్దం కాలానికి పైగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీలకు నగరపాలక సంస్థ అధికారులు నిరాకరించారు. జనవరి 10నుంచి జరగనున్న పోటీల వేదికను మార్చుకోవాలని సూచించారు. ఈ పాఠశాల క్రీడలకు మినహాయించి ఇతర ఏ కారక్రమాలకు ఇవ్వదంటూ కలెక్టర్, న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయని నగరపాలక సంస్థ అధికారులు అంటున్నారు. అనుమతి లేకుండా మైదానంలో వేదికలు ఏర్పాటు చేసిన ఈదర హరిబాబుపై నగరపాలక సంస్థ అధికారులు పాలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటక పోటీలకు ఆటంకం - NTR Kala Parishad organizes drama competitions newsupdates
ఒంగోలులో జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలకు ఆటంకం ఎదురైంది. అనుమతి లేకుండా మైదానంలో వేదికలు ఏర్పాటు చేసిన ఈదర హరిబాబుపై నగరపాలక సంస్థ అధికారులు పాలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమతి లేకుండా..ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలకు ఏర్పాటు