ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌నగర్‌లో వాలంటీర్‌గా పని చేస్తున్న ధనలక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. ఈమెకు అయిదేళ్ళ క్రితం నంద్యాలకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పటినుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటూ... గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. రాత్రి ఇంటిపైనున్న గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది.
యర్రగొండపాలెంలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - Yarragondapalem crime news
గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అంబేడ్కర్‌నగర్‌లో జరిగింది.
యర్రగొండపాలెంలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య