బద్వేలులో భార్యను కడతేర్చేందుకు భర్త యత్నం.. - murder attempt in kadapa badwelu
కడప జిల్లా బద్వేల్ బి.వి.ఆర్ కళాశాల వద్ద భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వదినను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు.
కడప జిల్లా బద్వేలు మండలం తిరువెంగళాపురానికి చెందిన సులోచనకు... బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంటకు చెందిన పాణ్యం శేఖర్‌తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. పెళ్లైన రెండు సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో ఇద్దరు కూతుళ్లతో సులోచన పుట్టినింటికి చేరింది. నందిపల్లె వద్ద పాల డైరీలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తోటివారితో ఆటోలో కలిసి పనికి వెళ్తున్న సులోచనపై భర్త కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన వారిని చంపుతానంటూ బెదిరించాడు. సకాలంలో స్థానికులు స్పందించి ప్రాణాపాయన్ని తప్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి-భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు
Body:555
Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8008573492
కడప జిల్లా బద్వేల్ బి వి ఆర్ కళాశాల వద్ద భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వదినను కత్తితో దాడి చేసి చేతిని గాయపరిచాడు . స్థానికులు అడ్డుకోవడంతో హంతకుడు వారిని వదిలేసి పరార్ అయిపోయారు .
బద్వేలు మండలం తిరు vengalapuram గ్రామానికి చెందిన సులోచన కు బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట కు చెందిన పాణ్యం శేఖర్ తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు ఆడ సంతానం కలిగారు .వారి మధ్య స్పర్థలు తలెత్తడంతో పిల్లలతో సులోచన పదేళ్ల కిందట పుట్టినిల్లు చేరింది. నంది పల్లె వద్ద పాల డైరీ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది .ఈ క్రమంలో ఆటోలో సులోచన తోటివారితో కలిసి పనికి వెళ్తుండగా భర్త శేఖర్ కత్తితో ద్విచక్ర వాహనంతో వెంబడించారు . భార్య సులోచన ను చంపేందుకు ప్రయత్నించాడు .అడ్డుకోబోయిన వారిని పై చంపుతానంటూ భయోత్పాతం సృష్టించారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో భార్యను ,వదిన ప్రాణాలు కాపాడే గలిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి కోసం కోసం గాలిస్తున్నారు.