ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల లో మద్యం దుకాణం తొలగించాలని కోరుతూ.. ఒంగోలులో మహిళలు ఆందోళన చేపట్టారు. భాగ్యనగర్లోని వెలుగు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి సమస్యను వివరించారు. గ్రామంలోని బస్టాండ్ కూడలిలో ఉన్న మద్యం దుకాణం తీసివేసేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేస్తానని మంత్రి హామీ ఇచ్చారని మహిళలు అన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణం తీసివేయాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మద్యం దుకాణం తొలగించాలంటూ మహిళల ఆందోళన - bestavaripeta
తమ గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించాలని ఒంగోలులో మహిళలు ఆందోళన చేపట్టారు.
మద్యం దుకాణం