ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొరవడిన పర్యవేక్షణ.. కొండెక్కిన కూరగాయల ధరలు

ప్రకాశం జిల్లా చీరాలలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో.. వ్యాపారులు ఇష్టారీతిన అమ్ముతున్నారు. ధరల పట్టికను పట్టించుకోకుండా ఒక్కో దుకాణాంలో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

vegetables rates high in chirala prakasam district
చీరాల కూరగాయల మార్కెట్

By

Published : Jun 13, 2020, 11:54 AM IST

అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రకాశం జిల్లా చీరాలలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా నెహ్రూ కూరగాయల మార్కెట్​ను మూసేశారు. పట్టణంలోని సచివాలయం సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేశారు. మొదట్లో అధికారుల పర్యవేక్షణలో ధరల పట్టిక ప్రకారం కూరగాయలు అమ్మారు. అయితే ప్రస్తుతం ధరలపై నియంత్రణ కొరవడింది.

అధికారులు పట్టించుకోకపోవటంతో వ్యాపారులు ఇష్టారీతిన అమ్ముతున్నారు. ధరలపట్టికను పట్టించుకోకుండా ఒక్కో దుకాణంలో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. కిలో పచ్చిమిర్చి రూ. 120 ఉండగా.. కూరగాయలు కేజీ రూ. 60 నుంచి రూ. 70కు అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరలను నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details