ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు.
నిరుపేదలకు కూరగాయలు పంపిణీ - ప్రకాశం జిల్లా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన కఠినంగా కొనసాగుతోంది. ఫలితంగా నిరుపేదలు, కార్మికులు, వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
నిరుపేదలకు కూరగాయలు పంపిణీ