ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 12:31 PM IST

ETV Bharat / state

అంత పని చేస్తే.. కూలీ ఇంతేనా?

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న కూలీలకు కష్టాలే మిగులుతున్నాయి. ఎంత పని చేసినా కనీస కూలీ కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

upadhi hami workers
పనికి తగిన కూలీ రావడం లేదని ఉపాధి కూలీల ఆవేదన

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని బసవన్నపాలెం గ్రామంలో రోజూ వందల సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వం 200 రూపాయలకు తగ్గకుండా కూలి ఇవ్వాలని చెబుతున్నా... రోజుకు 30 నుంచి 40 రూపాయల కంటే ఎక్కువ అందడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.

ఈ కారణంగా.. గ్రామస్థులు పనులకు వెళ్లేందుకు అసక్తి చూపించడం లేదు. కుటుంబాలు గడవక దిక్కులేని పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి పనికి తగిన కూలీని అందించేలా చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యంగా కూలీలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details