ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామంలో మోండ్రు గోపాల్ అనే రైతుకు చెందిన 2ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. దీంతో తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. విషయం తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానిక బల్లికురవ పోలీస్ అధికారులకు తెలిపారు.
చెరుకు తోటకు నిప్పు.. పరిశీలించిన ఎమ్మెల్యే - latest aadhanki news
2ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో జరిగింది. ఘటనా స్థలాన్ని అద్దంకి ఎమ్మెల్యే పరిశీలించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశిచారు.
చెరుకు తోటకు నిప్పు ఆంటించిన దుండగలు.. పరిశీలించి ఎమ్మెల్యే