ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ కరెన్సీకి ఆశపడితే కత్తులతో బెదిరించి దోచేశారు!

లక్ష రూపాయలకు మూడు లక్షలు నకిలీ కరెన్సీ ఇస్తాం.. నిజం నోట్లు లాగనే ఉంటాయి.. బయట మార్కెట్‌లో సులభంగా చలామణి అయిపోతాయి అంటూ నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేయాలని భావించిన దుండగుల ఆటను పోలీసులు కట్టించారు.

రూ.లక్షకు 3 లక్షలు అన్నారు.. కత్తులతో బెదిరించి దోచేశారు
రూ.లక్షకు 3 లక్షలు అన్నారు.. కత్తులతో బెదిరించి దోచేశారు

By

Published : Oct 8, 2020, 11:27 PM IST

కర్నూలు జిల్లా పెసరవాయి గ్రామానికి చెందిన రమేశ్ నకిలీ కరెన్సీకి ఆశపడి దోపిడీకి గురయ్యాడు.

నకిలీ కరెన్సీ..

రమేశ్ తన స్నేహితుడు దాసుకి నకిలీ కరెన్సీ విషయం చెప్పి, ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి సదరు వ్యక్తిని కలవమని సూచించాడు. సదరు ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయగా చీరాలకు చెందిన వనేశ్ పరిచయం చేసుకున్నాడు. రూ.లక్ష అసలు నోట్లకు 3 లక్షల నకిలీనోట్లు ఇస్తామని నమ్మబలికాడు.

పరీక్షించుకోవాలని చెప్పి..

రమేశ్, అతని స్నేహితుడు నాగేశ్వరరావును వెంటపెట్టుకుని నిందితులు చెప్పిన పెద్దారవీడు మండలం కుంట జంక్షన్‌ వద్దకు చేరుకున్నారు. వనేష్‌ ఓ వృద్ధుడిని రూ.500 రూపాయల నోట్లతో రమేశ్ వద్దకు పంపించారు. నోట్లను పరీక్షించుకోవాలని వృద్ధుడు చెప్పగా.. జనసమూహం ఉంది కనుక గ్రామ వెలుపల పరీక్షించుకోవచ్చునని ఇద్దరినీ కారులో తీసుకెళ్ళాడు.

కత్తులతో బెదిరింపులు..

అప్పటికే కారులో ఉన్న మరో నలుగురు కలిసి వీరిని కత్తులతో బెదిరించి, వెంట తీసుకువచ్చిన 50 వేల రూపాయలు, మొబైల్‌ ఫోన్​ను అపహరించుకుపోయారు. రమేశ్ పెద్దారువీడు పోలీసులకు పిర్యాదు చేయగా, వెంటనే ప్రత్యేక బృందాలు అప్రమత్తమై కొద్ది సేపట్లోనే నిందితులను పట్టుకున్నారు. మొత్తంగా ఐదుగురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ వెల్లడించారు.

ఇవీ చూడండి:

యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details