ఇంటికి వేసిన తాళాన్ని దుండగులు పగలగొట్టి నగదు, బంగారం దోచుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పట్టణంలోని వస్తాద్గారి వీధిలో కాసింవలీ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి మార్కాపురం వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా... బీరువా తెరిచి ఉంది. బట్టలు, వస్తువులు చల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ముక్కంటీ దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.3 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారని బాధితులు చెప్పారు.
ఇదీ చదవండీ:
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..! - యర్రగొండపాలెంలో చోరీ
ఊరెళ్లి రెండు రోజుల్లో తిరిగి వచ్చేద్దామనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసే వెళ్లారు. మాటు వేసిన దుండగులు తాళం బద్దలుకొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇంటి తాళం పగలకొట్టి చోరీ