తొమ్మిది రోజుల పాటు జస్టిస్ ఫర్ దిశ అంటూ రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రకాశం జిల్లా ఒంగోలు విద్యార్థినులు.. తెలంగాణ పోలీసులు నలుగురు మృగాళ్లను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జోహార్ దిశ, జై సజ్జనార్ సర్, జై తెలంగాణ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. ఘటన జరిగిన వెంటనే శిక్ష విధించాల్సిందని పలువురు విద్యార్ధులు అభిప్రాయపడ్డారు. నడిరోడ్డుపై శిక్షలు అమలు చేసినప్పుడే ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేయాలంటే భయ పడతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం పటిష్ఠ చట్టాలు తీసుకురావాలని విద్యార్ధులు ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: