రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకలి ఇబ్బందులు తొలగించేందుకు బియ్యంతోపాటు, కిలో కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి నాలుగో విడత సాయం కింద చౌకధరల దుకాణాల నుంచి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్డులో ఉన్న సభ్యులకు ఒక్కొక్కరికి బియ్యంతోపాటు, కిలో శనగలు ఉచితంగా ఇస్తున్నారు.
యర్రగొండపాలెంలో నాలుగో విడత రేషన్ పంపిణీ - యర్రగొండపాలెం వార్తలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నేటి నుంచి నాలుగో విడత సాయం కింద చౌకధరల దుకాణాల నుంచి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. తగు చర్యలు తీసుకుని పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
నాలుగో విడత రేషన్ పంపిణి