ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద ప్రతిపాదికన పనిచేసిన నర్సులు నిరసనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసిన తమను తొలగించడం దారుణమని అన్నారు. ఆరు నెలలుగా ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు కేవలం మూడు నెలల వేతనాలే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఆధారంగా ఉద్యోగాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
అర్హత ఆధారంగా ఉద్యోగాలు కొనసాగించాలని నర్సుల నిరసన
ప్రకాశం జిల్లా మార్కాపురంలో కరోనాను లెక్కచేయకుండా తాత్కాలిక నర్సులుగా విధులు నిర్వహించిన వారు ఆందోళనకు దిగారు. అర్హత ఆధారంగా ఉద్యోగాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
నర్సుల నిరసన